
- ఆడబిడ్డను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్రు
- ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్
చేర్యాల, వెలుగు : ఆడబిడ్డను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని తరిమికొడతామని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్ హెచ్చరించారు. బుధవారం మార్కెట్‌యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మట్లాడారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బద్నాం చేయడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సమస్యలను రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. ముత్తిరెడ్డి కూతురును కొమ్మురి అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
రోజుకో పార్టీ మారుతున్న కొమ్మూరికి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధిచెపుతారని హెచ్చరించారు. తుల్జా భవాని రెడ్డి తన పేర రిజిస్ట్రేషన్ చేయించిన పట్టా భూమిని చేర్యాల మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు సత్యనారాయణ, రాజేశం, ఆగమల్లు, బుచ్చిరాములు, సదానందం, మేర్గు క్రిష్ణ, రాములు గౌడ్, రామరాజు గౌడ్, యూత్ నాయకులు ఆకుల రాజేశ్, టి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.