రేటింగ్‌‌, ర్యాంక్‌‌ను పట్టించుకోను : ఎరిగైసి అర్జున్‌‌

రేటింగ్‌‌, ర్యాంక్‌‌ను పట్టించుకోను : ఎరిగైసి అర్జున్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: చెస్‌‌ ఫన్ గేమ్ అని దీన్ని అస్వాదిస్తూ ఆడాలని ఇండియా గ్రాండ్ మాస్టర్‌‌‌‌, చెస్ ఒలింపియాడ్‌‌ గోల్డ్ మెడలిస్ట్‌‌ ఎరిగైసి అర్జున్ యువ ప్లేయర్లకు సూచించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 ఎలో రేటింగ్ అందుకున్న రెండో ఇండియన్‌‌గా నిలిచిన అర్జున్ ఇటీవలే వరల్డ్‌‌ నంబర్‌‌ 3 ర్యాంక్ కూడా  అందుకున్నాడు. అయితే,‌‌  మారుతూ ఉండే రేటింగ్స్‌‌, ర్యాంకింగ్స్‌‌ను తాను పట్టించుకోనని తెలిపాడు. వరల్డ్ చాంపియన్‌‌ అవ్వాలన్నదే తన టార్గెట్ అని చెప్పాడు. దానికి కనీసం రెండేండ్లయినా పడుతుందన్నాడు. 

డింగ్ లిరెన్‌‌తో  వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌ మ్యాచ్ ఆడనున్న తన తోటి ప్లేయర్ గుకేశ్‌‌  టైటిల్ గెలిచే అవకాశాలు 80–90 శాతం ఉన్నాయన్నాడు. వచ్చే నెలలో జరిగే చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ చెస్‌‌తో పాటు  టాటా ఓపెన్‌‌పై ఫోకస్ పెట్టానని తెలిపాడు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్‌‌లో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్‌‌ తరఫున గోల్డ్ మెడల్స్ సాధించిన అర్జున్‌‌తో పాటు  హరికృష్ణ, హారిక, వంతిక అగర్వాల్‌‌, కెప్టెన్‌‌ శ్రీనాథ్‌ను హైదరాబాద్‌‌లో మంగళవారం ప్రవాహ ఫౌండేషన్‌, మైత్రా ఎనర్జీ, ఎంజీడీ1 సంస్థలు ఘనంగా సన్మానించాయి.