బ్లిట్జ్‌‌‌‌లో ఆనంద్‌‌ను దాటిన తెలంగాణ ప్లేయర్

బ్లిట్జ్‌‌‌‌లో ఆనంద్‌‌ను దాటిన తెలంగాణ ప్లేయర్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ చెస్‌‌ ప్లేయర్‌‌ ఎరిగైసి అర్జున్‌‌ అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ ప్లేయర్‌‌ విశ్వనాథన్‌‌ ఆనంద్‌‌ను వెనక్కు నెట్టి  బ్లిట్జ్‌‌ కేటగిరీలో ఇండియా నుంచి నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ అందుకొని ఔరా అనిపించాడు. వరంగల్‌‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్‌‌ ప్రస్తుతం 2765 రేటింగ్‌‌ పాయింట్లతో ఇండియా టాప్‌‌ ప్లేయర్‌‌గా,  వరల్డ్‌‌లో 13వ ర్యాంక్‌‌లో నిలిచాడు. నార్వే లెజెండ్‌‌ మాగ్నస్‌‌ కార్ల్‌‌సన్‌‌ 2892 పాయింట్లతో వరల్డ్‌‌ నం.1 ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. 

బాకులో జరిగిన వుగర్‌‌ గషిమోవ్‌‌ మెమోరియల్‌‌ చెస్‌‌ టోర్నమెంట్‌‌ బ్లిట్జ్‌‌ ఈవెంట్‌‌లో ఆనంద్‌‌ చివరి స్థానం సాధించడంతో ఇప్పటిదాకా ఇండియా నం.1గా ఉన్న అతను రెండో ప్లేస్‌‌కు పడిపోయాడు. వరల్డ్‌‌ ర్యాంకింగ్స్‌‌లో ఏకంగా నాలుగు నుంచి 16వ ప్లేస్‌‌కు పడిపోయాడు.  దాంతో, బ్లిట్జ్‌‌లో ఇండియా టాప్‌‌ ర్యాంకర్‌‌ అయ్యానని తెలుసుకున్న అర్జున్‌‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నెల 25 నుంచి జరిగే వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌, బ్లిట్జ్‌‌ టోర్నీలో రాణించడంపై ఫోకస్‌‌ పెట్టానన్నాడు. ఇటీవల కోల్‌‌కతాలో జరిగిన టాటా స్టీల్‌‌ చెస్‌‌లో  ర్యాపిడ్‌‌ టైటిల్‌‌ నెగ్గిన అర్జున్‌‌ బ్లిట్జ్‌‌లో రన్నరప్‌‌గా నిలిచాడు.