Gukesh Dommaraju: గుకేశ్.. దేశాన్ని గర్వపడేలా చేశావ్.. వరల్డ్ చెస్ ఛాంపియన్‌కు ప్రశంసల వెల్లువ

Gukesh Dommaraju: గుకేశ్.. దేశాన్ని గర్వపడేలా చేశావ్.. వరల్డ్ చెస్ ఛాంపియన్‌కు ప్రశంసల వెల్లువ

న్యూఢిల్లీ: భారత చెస్ యువ సంచలనం దొమ్మరాజు గుకేష్ (18) వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్-2024  విశ్వ విజేతగా అవతరించాడు. సింగపూర్ వేదికగా గురువారం (డిసెంబర్ 12) జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ ఫైనల్ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్నాడు పద్దెనిమిదేళ్ల కుర్రాడు. ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 

ALSO READ | World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేష్

ఈ క్రమంలో వరల్డ్ చెస్ ఛాంపియన్‌‎గా నిలిచిన గుకేష్‎కు ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. -సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ, క్రీడా, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ ఛాంపియన్‎కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా అభినందలు తెలిపారు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్-2024 విజేతగా నిలిచి గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశావని కొనియాడారు. 

ప్రధాని మోడీ సైతం గుకేష్‎కు శుభాకాంక్షులు తెలిపారు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంఫియన్‎గా నిలిచిన గుకేశ్ విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని ప్రశంసించారు మోడీ. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని అన్నారు. కేంద్ర హోంమంత్రి కూడా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా, ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.