కోల్కతా నైట్ రైడర్స్కు బ్యాడ్ న్యూస్.. ఉమ్రాన్ స్థానంలో సకారియా..

కోల్కతా నైట్ రైడర్స్కు బ్యాడ్ న్యూస్.. ఉమ్రాన్ స్థానంలో సకారియా..

కోల్‌‌కతా:  స్పీడ్‌‌స్టర్ ఉమ్రాన్ మాలిక్  ఐపీఎల్ 18వ సీజన్‌‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది  కోల్‌‌కతా నైట్ రైడర్స్ కు ఎంపికైన ఉమ్రాన్ గాయం కారణంగా లీగ్‌ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అతని  స్థానంలో చేతన్ సకారియాను తమ జట్టులోకి తీసుకున్నట్టు కేకేఆర్ ఆదివారం ప్రకటించింది. ఉమ్రాన్ 2022 సీజన్‌‌లో సన్‌‌రైజర్స్ తరఫున 14 మ్యాచ్‌‌ల్లో 22 వికెట్లు పడగొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. లీగ్‌‌లోనే ఫాస్టెస్ట్ పేసర్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్‌ను  కేకేఆర్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌‌తో కొనుగోలు చేసింది.