కన్నడ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కాస్మోటిక్ సర్జరీ వికటించి 21ఏళ్ల కన్నడ నటి చేతన రాజ్ మృతిచెందారు. కొవ్వును తొలగించే ప్లాస్టిక్ సర్జరీ కోసం చేతన్ రాజ్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం(మే 16వ తేదీన) చేరారు. ఫ్యాట్ ఫ్రీ కోసం కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. శస్త్రచికిత్స అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చేతన రాజ్ మృతిచెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత చేతన ఊపిరితిత్తుల్లో నీరు నిండిపోయి గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.
చేతన రాజ్ ఆరోగ్యం క్షిణించడంతో 45 నిమిషాల పాటు సీపీఆర్ పద్ధతిలో వైద్యం అందించామని, అయినా ఫలితం లేకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించామని డాక్టర్లు చెప్పారు. కానీ, ఆమె అప్పటికే చనిపోయిందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చేతన రాజ్ చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యం చేసిన డాక్టర్లపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Kannada TV actor Chethana Raj passes away after fat removal surgery
— ANI Digital (@ani_digital) May 17, 2022
Read @ANI Story | https://t.co/1ThSAFhcFT#KannadaActress #ChethanaRaj pic.twitter.com/sIcDaopXJF
చేతన రాజ్ పలు యాడ్ లు, సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గీత, దొరసాని, ఒలవిన్ నిల్దాన్ వంటి కన్నడ సీరియల్స్ తో చాలా పాపులర్ అయ్యారు. ‘హవయామి’ సినిమాలోనూ ఆమె నటించింది. అయితే.. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. చేతన రాజ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. మంచి నటిని కోల్పోయామంటూ ట్విట్స్ చేస్తున్నారు.
Karnataka | Kannada TV actress Chethana Raj passed away at a hospital in Bengaluru where she was admitted on May 16 for liposuction surgery. Her family alleged that she died due to the negligence of hospital. Police has registered a case against the hospital. pic.twitter.com/A35Hhbl5dT
— ANI (@ANI) May 17, 2022
మరిన్ని వార్తల కోసం..
నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న హైపర్ టెన్షన్