వెటరన్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా టీమిండియాలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశవాళీలో పరుగుల వర్షం పారిస్తున్నాడు. సెంచరీల సెంచరీలు కొడుతూ సెలక్టర్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్ లో అసాధారణంగా బ్యాటింగ్ చేస్తూ త్వరలో టీమిండియా తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. శనివారం (ఫిబ్రవరి 17) రాజ్‌కోట్‌లో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ బాది తన అవసరం జట్టుకు ఉందని తెలియజేశాడు.
105 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 108 పరుగులు చేసి జట్టు స్కోర్ 524/5 వద్ద రోనాల్డ్ లాంగ్‌జామ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పుజారా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో ఇది మూడో సెంచరీ. ఓవరాల్ గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 63వ సెంచరీ. 2023-24లో రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఛెతేశ్వర్ పుజారా 11 ఇన్నింగ్స్ ల్లో 78.1 సగటుతో 781 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
పుజారా ఉన్న ఫామ్ చూస్తుంటే త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టం బాగుంటే నాలుగో టెస్టుకు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత జట్టులో ఎవరికైనా గాయం అయితే ఆ స్థానంలో పుజారాను సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత కారణాల వలన చెన్నై వెళ్లిపోయిన అశ్విన్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. మరి పుజారా తన రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.
పుజారా చివరిసారిగా భారత్ తరపున 2023 లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 14, 27 పరుగులు చేసి నిరాశపరించిన ఈ వెటరన్ బ్యాటర్ కు ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్ కు సెలక్టర్లు గట్టి షాకిచ్చారు. పూజారాపై వేటు వేసి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు సైతం పుజారాకు సెలక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఇక పుజారా టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించినా..రంజీ సీజన్ లో సత్తా చాటి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
Cheteshwar Pujara in Ranji Trophy 2024:
— Johns. (@CricCrazyJohns) February 17, 2024
243*(356), 49(100), 43(77), 43(105), 66(137), 91(133), 3(16), 0(6), 110(230), 25(60) & 108(105) pic.twitter.com/9rI8NrZqXR