చేవెళ్ల, వెలుగు: రైతులందరికీ రుణ మాఫీ వరిస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. నగదు జమ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించిన ట్లు చెప్పారు. బుధవారం చేవెళ్లలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని, ఆ బాధ్యత బ్యాంకర్లపై ఉందని పేర్కొన్నారు.
రుణ మాఫీ చేయలేద ని నేడు చేవెళ్లలో కేటీఆర్ధర్నా చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కావాలని ధర్నాలకు దిగుతున్నారని విమర్శించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.