చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి ఎస్సీ సబ్ ప్లాన్ సీఆర్‌ఆర్ ఫండ్స్ కింద రూ.10.40 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. తన క్యాంపు ఆఫీస్‌లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ నిధులతో చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబ్పేటమండలాలల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.
అలాగే చేవెళ్ల, మొయినాబాద్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు రూ.1.60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్‌కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నక్క బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.