పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్మెన్ జీవితం

పాపం.. చావు చెప్పి రాదంటే ఇదేనేమో.. అర్థాంతరంగా ముగిసిన చేవెళ్ల ఎంఎల్ఏ గన్మెన్ జీవితం

సంగారెడ్డి జిల్లా: ‘చావు ఎప్పుడూ చెప్పి రాదు’ (Death is So Unpredictable) అంటుంటారు. BDL భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. బైక్పై వెళ్తున్న  వికారాబాద్ AR  కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్ బైక్ను సడన్గా అడవి పంది ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముత్తంగి శ్రీనివాస్ తీవ్ర గాయాలు కావడంతో స్పాట్లోనే ప్రాణం పోయింది.

కొండకల్ నుంచి వెలిమెల వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం  మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చేవెళ్ల ఎంఎల్ఏ దగ్గర ముత్తంగి శ్రీనివాస్ గన్మెన్గా పని చేస్తున్నాడు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఎవరూ అనుకోరు.

Also Read : కుల గణన సర్వేలో పాల్గొనకపోతే మళ్లీ డిటైయిల్స్ ఇవ్వొచ్చు

బైక్పై తన దారిలో తను వెళుతుంటే అడవి పంది మృత్యువు రూపంలో వచ్చి శ్రీనివాస్ ప్రాణాన్ని తీసుకెళ్లిపోయింది. ఈ విషాదం గురించి తెలిసి శ్రీనివాస్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేవెళ్ల ఎంఎల్ఏ కాలే యాదయ్య తన గన్ మెన్ శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. శ్రీనివాస్ స్వస్థలం శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామం అని తెలిసింది.