- ఢిల్లీలో కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, ఎ.చంద్రశేఖర్, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.
వారం, పది రోజుల్లో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వారిలో యాదయ్య మూడో ఎమ్మెల్యే.. అంతకు ముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, దానికి ముందు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. త్వరలో మరి కొంత మంది కారు దిగి హస్తం గూటికి రానున్నారనే ప్రచారం సాగుతున్నది.