అప్పా జంక్షన్–మన్నెగూడ రోడ్డు పనుల్లో వేగం పెంచాలె:ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్ నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా  హిమాయత్​సాగర్​లోని అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్​లోని మన్నెగూడ వరకు చేపట్టిన  విస్తరణ పనుల్లో వేగం పెంచాలని చేవెళ్ల ఎంపీ  గడ్డం రంజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

10 రోజుల కిందట ఈ పనులు ప్రారంభం కాగా.. మంగళవారం మొయినాబాద్ పరిధి టోల్ కట్ట, అజీజ్​నగర్ ప్రాంతాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి పర్యటించి వాటిని పరిశీలించారు. ఎమ్మార్వో అశోక్ కుమార్​తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రంజిత్​రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనులపై ప్రతిరోజు కలెక్టర్​తో కలిసి రివ్యూ చేస్తున్నట్లు తెలిపారు. తొందరగా పనులను పూర్తి చేయాలని సూచించారు.