వికారాబాద్, వెలుగు : తాండూర్ సీసీఐలో సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటులో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.
సీసీఐ కార్మికులు, వారి కుటుంబాల కోసం ఈ ప్రాంతంలో ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటు చేయాలని, ఉద్యోగుల ఇతర సమస్యలను పరిష్కరించి, సీసీఐని బలోపేతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు.