ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి  : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న  గ్రాడ్యుయేట్లు, టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ  ముఖ్య నేతలు, గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి కోసం ఆచరణ సాధ్యం కానీ , అమలు చేయలేని హామీలతో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి.. ఈ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అన్నివర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. పట్టభద్రుల, టీచర్స్  ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కకొమురయ్యకు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని కోరారు. 

సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, లీడర్లు బాస సత్యనారాయణ రావు, సునీల్ రావు, డి.శంకర్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, జితేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారి రాజేంద్రప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి, పాల్గొన్నారు.