చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బడంగ్ పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లోని చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న  విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నేనావత్ జీవన్ అనే విద్యార్థి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఉదయం రూం నుంచి బయటకు రాకపోవడంతో గదికి వెళ్లి చూడగా..  ఉరివేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతుడు జీవన్ స్వస్థలం ఆమన్గల్ మండలం నుచుకుంట తండా. అయితే కొడుకు మృతి విషయం తల్లి దండ్రులకు చెప్పకుండానే మృతదేహాన్ని హాస్టల్ నుంచి తరలించడం వివాదాస్పదమైంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, పోలీసుల తీరుపై బాలుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.