యాలకలను ఎక్కువగా ఫ్లేవర్ కోసం, స్వీట్స్ లో రుచిని పెంచడం కోసం వాడుతుంటాం.. కానీ, వీటిలో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. అవును, నిజం యాలకలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు.ఇలాచీ వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి శ్వాసకోశ పనితీరును పెంచడం వరకు చాలా రకాలుగా యాలకలను ఉపయోగించారు ఆయుర్వేద వైద్యులు. రాత్రి పడుకునే ముందు కేవలం రెండు యాలకులు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: యాలకులు.. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉబ్బరం లేదా అసౌకర్యంగా అనిపిస్తే, యాలకులు నమలడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు యాలకులు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
న్యాచురల్ డిటాక్స్ ఏజెంట్ : యాలకులు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో తోడ్పడతాయి, మూత్రవిసర్జన ద్వారా టాక్సిన్స్ బయటకు పంపడంలో యాలకలు తోడ్పడతాయి.
నోటి దుర్వాసనను దూరం చేస్తుంది: యాలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన దూరం అవుతుంది. రాత్రిపూట యాలకలు నమలడం వల్ల నోటి దుర్వాసన పోవడమే కాకుండా దంతాలు, చిగుళ్లను హానికరమైన బ్యాక్టీరియా నుండి కాపాడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: యాలకులు మెటబాలిజంను పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని థర్మోజెనిక్ లక్షణాలు శరీరంలో కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడతాయి. రాత్రిపూట ఏలకులు తినడం వల్ల బరువు తగ్గుతారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది: యాలకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద చికిత్సలలో వీటి వాసన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక కప్పు ఇలాచీ టీ తాగడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి.
చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది: యాలకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఇది చర్మాన్ని మెరుస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి, అయితే ఇందులోని పోషకాలు జుట్టును బలంగా చేసి చుండ్రును కూడా నివారిస్తాయి.