OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT New Movies: ఓటీటీకి వచ్చేసిన ఇండస్ట్రీ సూపర్ హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నెట్‌ఫ్లిక్స్ (NETFLIX) ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు, ఫ్యామిలీ డ్రామా సినిమాలకు అసలు కొదవే లేదు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ నేడు ఏప్రిల్ 11న ఓ రెండు సూపర్ హిట్ సినిమాలను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే, మరొకటి తెలుగు సూపర్ హిట్ మూవీ. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథలేంటీ? ఆ సినిమాల బాక్సాఫీస్ వసూళ్లేంటీ? అనేది పూర్తిగా తెలుసుకుందాం.  

'కోర్ట్':

హీరో నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’. డైరెక్టర్ రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో హర్ష రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 2024 మార్చి 14న రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్ అయింది. 

'కోర్ట్' ఓటీటీ:

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకి దక్కించుకుంది. నేడు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే, ఈ మూవీ థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజై అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇపుడీ ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. 

ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా కథనం నడిపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. డబ్బు బలంతో గవర్నమెంట్ అధికారులను లొంగదీసుకోవడం, చట్టంలోని లొసుగులని వాడుకోవడం కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు. దానికితోడు కోర్ట్ డ్రామా ఇంటెన్స్గా ఉండటంతో మిగతా భాషల్లో కూడా మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.

ఛావా ఓటీటీ:

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఛావా ఓటీటీలోకి వ‌చ్చేసింది. నేడు ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రానున్న ఈ రెండ్రోజుల్లో తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించబోతుంది.  

►ALSO READ | Movie Review: అక్కడ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి X రివ్యూ.. 

ఈ మూవీ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్లకి పైగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీలో రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ దక్కించుకుంది.

తెలుగులో మార్చి 7న విడుదలైన ఈ సినిమాకు మూడు రోజుల్లో రూ.10 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్ సుమారు రూ.140కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించినట్లు అంచనా!

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ స్టోరీని ఎంచుకోవడం, అలాగే కథని అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సక్సెస్ అయ్యాడు. శంభాజీ మహారాజ్ పాత్రలో నటించిన విక్కీ కౌశల్, ఆయన భార్యపాత్రలో నటించిన రష్మిక మందాన తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశారు.

ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో, అలాగే ఫైట్ సీన్స్ లో ప్రాణం పెట్టేశాడు. ఇందులో వచ్చే యుద్ధం సన్నివేశాల స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. క్లైమాక్స్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా విక్కీ కౌశల్ ను చిత్ర హింసలకు గురిచేసే సీన్స్ లో, అతను పలికించిన హావభావాలు హైలెట్ గ నిలిచాయి. 

ఛావా కథేంటంటే:

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన అధికార బలంతో మరాఠా రాజులని మరియు వారికి సహాయం చేస్తున్న సామంత రాజులని చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. అయితే ఛత్రపతి శివాజీ మరణాంతరం మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఆయన తనయుడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) తీసుకుంటాడు. ఈ క్రమంలో మరాఠా యోధులతో కలసి ఔరంగజేబుని ముప్పతిప్పలు పెడుతుంటాడు.. 

అయితే  కొందరు వ్యక్తులు వెన్నుపోటు పొడవడంతో ఓ యుద్ధంలో శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చేతికి చిక్కుతాడు.. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది..? శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ఏం చేశాడు..? చివరికి మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు దక్కించుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.