Chhaavva Collections Day 1: మొదటి రోజు ఎన్ని రూ.కోట్లు కలెక్ట్ చేసిందంటే.?

Chhaavva Collections Day 1:  మొదటి రోజు ఎన్ని రూ.కోట్లు కలెక్ట్ చేసిందంటే.?

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందాన కలసి జంటగా నటించిన "ఛావా" సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తెలుగు ఆడియన్స్ రిక్వెస్ట్ చెయ్యడంతో ఈ సినిమాని శుక్రవారం (ఫిబ్రవరి 7) తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. అయితే  మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్  లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. బాలీవుడ్ భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా  తెలుగులో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది.. 

అయితే టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.3 కోట్లు (గ్రాస్) పైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ టాలీవుడ్ లో రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం స్కూల్స్,కాలేజీ స్టూడెంట్స్ కి పరీక్షలు ఉండటం, అలాగే సెలవులు లేకపోవడంతో ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ రిలీజ్ చేసిన టైమ్ రాంగ్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టోరీ ఏమిటంటే..?

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన అధికార బలంతో మరాఠా రాజులని మరియు వారికి సహాయం చేస్తున్న సామంత రాజులని చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. అయితే ఛత్రపతి శివాజీ మరణాంతరం మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఆయన తనయుడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) తీసుకుంటాడు. ఈ క్రమంలో మరాఠా యోధులతో కలసి ఔరంగజేబుని ముప్పతిప్పలు పెడుతుంటాడు.. 

అయితే  కొందరు వ్యక్తులు వెన్నుపోటు పొడవడంతో ఓ యుద్ధంలో శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చేతికి చిక్కుతాడు.. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది..? శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ఏం చేశాడు..? చివరికి మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు దక్కించుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.