
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన "ఛావా" మూవీ ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి హిందీ ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉత్తేకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దినేష్ విజన్ నిర్మించాడు. విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ పాత్రలో నటించగా ఆయన భార్య యేసుభాయిబాబు పాత్రలో నేషనల్ క్రష్ రశ్మిక మందాన నటించింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వికీ కౌశల్ నటనకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కొన్ని చోట్ల ఐతీకంగా ఛత్రపతి శివాజీ డైలాగులు చెబుతూ ఎమోషనల్ అవుతున్నారు.
అయితే మొదట్లో ఛావా మూవీకి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియాలో మొఘల్ చక్రవర్తులు చేసిన అక్రమాల గురించి మాట్లాడుతూ హిందూ రాజుల చరిత్రని లిఖించడం మర్చిపోయారని కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | RC16 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ స్టేజీ మీద బుచ్చిబాబు ఎమోషనల్..
మొదటి రోజు రూ.31.5 కోట్లు కలెక్ట్ చేసింది. మంచి పబ్లిసిటీ రావడంతో Sacnilk సమాచారం ప్రకారం 5 రోజుల్లోనే దాదాపుగా రూ.164 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 2వ రోజు రూ.37 కోట్లు, 3వ రోజు రూ.48.5 కోట్లు, 4వ రోజు రూ.24 కోట్లు, 5వ రోజు రూ.25 కోట్లు కలెక్ట్ చేసింది. వీకెండ్ తర్వత కూడా కలెక్షన్స్ డ్రాప్ కాకుండా ఉండటంతో ఈ వారాంతానికి సులభంగా రూ.200 కోట్లు మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో హిస్టరీ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు.