Chhaava: పార్లమెంటులో 'ఛావా' స్పెషల్ షో.. సినిమాకు పీఎం మోదీ, కేంద్ర మంత్రులు

Chhaava: పార్లమెంటులో 'ఛావా' స్పెషల్ షో..  సినిమాకు పీఎం మోదీ, కేంద్ర మంత్రులు

ఛత్రపతి శంభాజీ మహారాజ్ పై నిర్మించిన బాలీవుడ్ మూవీ 'ఛావా' పార్లమెంటులో ప్రదర్శించనున్నారు.  గురువారం (మార్చి 27న) పార్లమెంటు బాలయోగి ఆడిటోరియంలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఛావాను ప్రదర్శించే అవకాశం ఉందని సోమవారం (మార్చి 24న) పార్లమెంటు వర్గాలు తెలిపాయి.

ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. శంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన నటుడు విక్కీ కౌశల్‌తో సహా చిత్రంలోని మొత్తం తారాగణం స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.

ఛావాను ప్రశంసించిన ప్రధాని మోదీ:

2025 ఫిబ్రవరి 21న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌లో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ చారిత్రాత్మక చిత్రాన్ని ప్రశంసించారు ."దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఛావా " అని అన్నారు. ఈ గుర్తింపుతో చిత్ర నిర్మాతలు సంతోషించారు. ఈ మూవీ చారిత్రాత్మక గౌరవంగా అభివర్ణించారు. ప్రధానమంత్రి భారీ ప్రశంసలు ఇచ్చిన దాదాపు నెల రోజుల తర్వాత పార్లమెంట్ లో స్పెషల్ ప్రకటన రావడం విశేషం. 

ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్ సుమారు రూ.140కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించినట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించిందీ చావా.