మీరు మాములోళ్లు కాదయ్యా : ఛావా మూవీ చూసి నిధుల వేటకు వెళ్లిన జనం..!

మీరు మాములోళ్లు కాదయ్యా : ఛావా మూవీ చూసి నిధుల వేటకు వెళ్లిన జనం..!

అది సినిమా.. కల్పితం అని స్టార్టింగ్ లో ఉంటుంది.. ఇవన్నీ మనకు ఎక్కవ.. సినిమాలోని కథ కంటే ఎమోషన్స్ ముఖ్యం.. అది నిజం అయినా అబద్దం అయినా.. ఇదంతా నిన్నటి వరకు.. ఇప్పుడు రూటు మార్చారు జనం.. ఛావా మూవీ చూసిన తర్వాత.. కథలోని ఓ అంశాన్ని పట్టుకుని.. ఇప్పుడు జనం రాత్రీ పగలు అని తేడా లేకుండా నిధుల వేట మొదలుపెట్టారు. ఏదో ఒకరూ ఇద్దరూ అనుకుంటే కథలో కాలేసినట్లే.. వేలాది మంది జనం.. పలుగు పారలు పట్టుకుని.. రాత్రీ పగలు తేడా లేకుండా నిధుల వేట సాగిస్తున్నారు.. ఇదంతా ఛావా మూవీలో శివాజీ మహారాజ్ తన నిధులు దాచిన చోటు అంటూ ఇప్పుడు జనం అటువైపు పరుగులు తీస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఛావా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో మొఘల్ చక్రవర్తులు వెళుతూ వెళుతూ బంగారం, డబ్బు నిధుల్ని దోచుకెళ్లి మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోని అసిర్‌గఢ్ కోటలో దాచిపెట్టారని చూపించారు. దీంతో ఇది చూసిన జనం ఏకంగా పలుగు, పార పట్టుకుని అసిర్‌గఢ్ కోట పరిసర ప్రాంతంలో తవ్వటం ప్రారంభించారు. 

అంతేకాదు రాత్రి సమయంలో కూడా మెటల్ డిటెక్టర్లు, టార్చిలైట్లు వేసుకుని మరీ వెతుకుతున్నారు. దీంతో ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు త్రవ్వకాలు ఆపాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని  చేశారు. అయితే గతంలో దర్గా దగ్గర రోడ్డు నిర్మాణం సమయంలో జేసీబీ మట్టిని తవ్వుతున్న సమయంలో కొన్ని పురాతన నాణేలు బయపడ్డాయి. ఇవి మొఘలుల కాలం నాటికి చెందినవని పుకార్లు వైరల్ అయ్యాయి. అప్పటినుంచి ప్రజలు బంగారు నిధులు కోసం వేట ప్రారంభించారు.