
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందాన కలసి జంటగా నటించిన "ఛావా" సినిమా నేడు భారీ అంచనాల నడుమ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. బాలీవుడ్ భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
స్టోరీ ఏమిటంటే..?
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తన అధికార బలంతో మరాఠా రాజులని మరియు వారికి సహాయం చేస్తున్న సామంత రాజులని చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. అయితే ఛత్రపతి శివాజీ మరణాంతరం మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఆయన తనయుడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) తీసుకుంటాడు. ఈ క్రమంలో మరాఠా యోధులతో కలసి ఔరంగజేబుని ముప్పతిప్పలు పెడుతుంటాడు..
అయితే కొందరు వ్యక్తులు వెన్నుపోటు పొడవడంతో ఓ యుద్ధంలో శంభాజీ మహారాజ్ ఔరంగజేబు చేతికి చిక్కుతాడు.. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం ఏమైంది..? శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ఏం చేశాడు..? చివరికి మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబు దక్కించుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ స్టోరీని ఎంచుకోవడం, అలాగే కథని అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ సఫలం అయ్యాడని చెప్పవచ్చు. శంభాజీ మహారాజ్ పాత్రలో నటించిన విక్కీ కౌశల్, ఆయన భార్యపాత్రలో నటించిన రష్మిక మందాన తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశారు. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో, అలాగే ఫైట్ సీన్స్ లో ప్రాణం పెట్టాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో కొన్నిసీన్స్ లో ల్యాగ్ ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించే ఉంటే బాగుండేది.
ALSO READ : Kingston Review: హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'కింగ్‌స్టన్'.. ఊరిని వెంటాడుతున్న ఆ శాపమేంటీ?
ఇక సెకెండాఫ్ లో ఔరంగజేబు, శంభాజీ మహారాజ్ కి మధ్య తప్ప ఇతర సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. అంతేగాకుండా హీరో పక్కన ఉన్న పాత్రలు మరింతగా ప్రజెంట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ వాటిపై దర్శకుడు దృష్టి సారించలేకపోయాడు. ఇక యుద్ధం సన్నివేశాల స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.. ఫైనల్ గా క్లైమాక్స్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా చిత్ర హింసలకు గురిచేసే సీన్స్ కి తగ్గట్టుగా విక్కీ కౌశల్ పలికించిన హావభావాలు హైలెట్ అని చెప్పవచ్చు. కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా చూస్తే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీని ప్రజెంట్ చెయ్యడనికి దర్శకుడు చేసిన కృషి ఫలించిందని చెప్పవచ్చు.
టెక్నీకల్ టీమ్ పనితీరు:
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మొదటిసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ని మొదటిసారి ఎంచుకున్నప్పటికీ తెరపై చక్కగా ప్రజెంట్ చేశాడు. అలాగే కథకి తగ్గట్టుగా నటీనటుల్ని ఎంచుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక మేకింగ్ విధానంలో కూడా లక్ష్మణ్ ఉటేకర్ తన మార్క్ చూపించాడు. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా వ్యవహరించాడని చెప్పవచ్చు.
ఇక మ్యూజిక్ విషయానికొస్తే రెండు సార్లు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. సన్నివేశాలకి తగ్గట్టుగా బీజీయం సింక్ చేశాడు. ముఖ్యంగా వార్, ఫైట్ సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించాడని చెప్పవచ్చు. సాంగ్స్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ విభాగానికొస్తే బాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ మనీష్ ప్రధాన్ ఎడిటర్ గా పనిచేశాడు. మనీష్ ఫస్టాఫ్, సెకెండాఫ్ లోని కొన్ని సీన్స్ లో కత్తెర పెట్టాల్సింది. దీంతో ల్యాగ్ తగ్గి బోర్ కొట్టకుండా ఉండేది. ఓవరాల్ గా చూస్తే మంచి ఫాంటసీ, హిస్టారికల్ మూవీస్ ని ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి కచ్చితంగా నచ్చుతుంది.