తెలుగులో ‘ఛావా’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?

తెలుగులో  ‘ఛావా’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఛావా’ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్  ఆడియన్స్ ఫిదా అయ్యారు.  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. దీంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఇంట్రెస్టింగ్ గ ఎదురు చూస్తునారు. అయితే ఆదివారం మేకర్స్  ‘ఛావా’ సినిమా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. 

ఇందులో భాగంగా  ‘ఛావా’ సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ మార్చ్ 3న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆలాగే మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే  ‘ఛావా’ సినిమా ట్రైలర్ లో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే ఇప్పటివరకు కేవలం హిందీలో మాత్రమే ఏకంగా రూ.420 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ హీరో విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ‘ఛావా’ సినిమా టాప్ లో నిలిచింది.

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా స్టార్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించాడు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య పాత్రలో యేసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించింది.