Chhaava Telugu Trailer update: ‘ఛావా’ తెలుగు ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే.?

Chhaava Telugu Trailer update: ‘ఛావా’ తెలుగు ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే.?

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఛావా’ సినిమా తెలుగు రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్  ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ భావోద్వేగానికి గురవుతూ ఎమోషనల్ స్టోరీలు షేర్ చెయ్యడంతో మౌత్ పబ్లిసిటీ బాగా వచ్చింది.దీంతో కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.420 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. 

అయితే ఈ సినిమాన సౌత్ లో కూడా రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చెయ్యడంతో త్వరలోనే టాలీవుడ్ లో కూడా రిలీజే చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఛావా’ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా తుది దశలో ఉన్నట్లు సమాచారం. అయితే మేకర్స్ ‘ఛావా’ సినిమా తెలుగు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఇందులో భాగంగా మార్చి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సౌత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ : ప్రభాస్ కి హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. కన్ఫర్మ్ అయ్యిందా..?

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య పాత్రలో యేసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించింది. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.