Chhaava Trailer: తెలుగులో ఛావా ట్రైలర్ వచ్చేసింది.... రికార్డ్స్ కి సమయం ఆసన్నమైందంటూ..

Chhaava Trailer: తెలుగులో ఛావా ట్రైలర్ వచ్చేసింది.... రికార్డ్స్ కి సమయం ఆసన్నమైందంటూ..

బాలీవుడ్‌లో ఫిబ్రవరిలో నెలలో రిలీజ్ అయిన 'ఛావా' బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్  ఆడియన్స్ ఫిదా అయ్యారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా స్టార్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించాడు. 

ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య పాత్రలో యేసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించింది. ఔరంగజేబు పాత్రలో ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా నటించగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు (సోమవారం మార్చ్ 3) మేకర్స్ యూట్యూబ్ లో 3:08 నిమిషాల నిడివిగల ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

తెలుగు ట్రైలర్ లో హీరో విక్కీ కౌశల్ వాయిస్ పై మరింత శ్రద్ధ చూపించి ఉంటె బాగుండేది.. ముఖ్యంగా కొన్ని డైలాగులు చెప్పే సమయంలో గాంభీర్యం, ఉచ్చరణ వంటివి తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక నటి రష్మిక మందాన, అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.. విజవల్స్, స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. ముఖ్యంగా యాక్షన్, ఫైట్స్, హీరో ఎలివేషన్ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. 

ఇక ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో తన మార్క్ చూపించాడు. యాక్షన్ & ఎమోషన్స్ సీన్స్ తగ్గట్టుగా బీజీయం సింక్ చేశాడు. ఓవరాల్ గా చుస్తే ట్రైలర్ ఫర్వాలేదనిపించింది. హిందీలో రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా భర్తీ అంచనాలతో మార్చ్ 7న రిలీజ్ కానుంది.  అయితే తెలుగులో ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తోంది.