
డాన్స్ బార్లు.. ఇప్పటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. 90ల కాలంలో డాన్స్ బార్లు ఒక ఊపు ఊపాయి. ఇప్పటి పబ్ లను మించి డాన్స్ బార్ల హడావిడి ఉండేది అప్పట్లో. 20ఏళ్ళ కిందట బ్యాన్ అయిన డాన్స్ బార్లు మళ్ళీ ఓపెన్ అవనున్నాయి.. ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2005లో ప్రభుత్వం డాన్స్ బార్లపై బ్యాన్ విధించింది ప్రభుత్వం. అప్పట్లో నైట్ కల్చర్ వివాదాస్పదంగా మారడం.. డాన్స్ బార్లు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని వాదనలు రావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
అయితే.. ఏళ్ళ తరబడి నిరసనలు, న్యాయ పోరాటాల తర్వాత ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్ బార్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ డాన్స్ బార్ల కథా కమామిషీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 2005లో, డ్యాన్స్ బార్‌లపై బ్యాన్ విధిస్తూ అప్పటి హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట సవరణను సవాలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు 2016లో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ రూమ్ లలో అశ్లీల నృత్యాల నిషేధం, ప్రొటెక్షన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ విమెన్ యాక్ట్ నువు అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.
Also Read : విజృంభిస్తోన్న గులియన్ బారే సిండ్రోమ్
రాష్ట్ర చట్ట సవరణలను సవాలు చేసిన తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు 90లు మరియు 2000ల ప్రారంభంలో చాలా వివాదాస్పదంగా మారిన ఈ ఆఫ్టర్-అవర్ సంస్కృతిని అనుమతించడానికి నిరాకరించాయి. ఆ తర్వాత రాష్ట్రం 2016లో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు బార్ రూమ్‌లలో అశ్లీల నృత్యాల నిషేధం మరియు మహిళల గౌరవ పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
అయితే.. డాన్స్ బార్లపై నిషేధం ఎత్తివేతకు సంబందించిన ముసాయిదా బిల్లుకు మంగళవారం ( ఫిబ్రవరి 18, 2025 ) రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపాల్సి ఉండగా.. కొన్ని మార్పుల కోసం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ద్వారా కేవలం డాన్స్ బార్లపై నిషేధం ఎత్తివేయడమే కాకుండా.. డాన్స్ బార్లు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ను ప్రభావితం చేయకుండా ఉండేలా విధివిధానాలు రూపొందించటమే ఈ బిల్లు లక్ష్యమని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది