సిటీలోని నార్త్ఇండియన్స్ గురువారం ఛత్పూజలను ఘనంగా జరుపుకున్నారు. బిహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించిన ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంజీవయ్య పార్క్ సమీపంలో, ట్యాంక్ బండ్‌పైనున్న బతుకమ్మ ఘాట్ వద్ద సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు.
మట్టి కుండల్లో వండిన ప్రసాదాలను, ఫలహారాలను నైవేద్యంగా సమర్పించారు. కార్తీక మాసంలోని తొలి వారంలో సూర్యుడిని పూజిస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఛత్పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. – ఫొటోగ్రాఫర్, వెలుగు