యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో హిందూవాహిని ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు శివాజీ వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం హిందూ వాహినీ స్టేట్ ప్రెసిడెంట్ ఉప్పల రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, హిందూ వాహని లీడర్లు శివ గణేష్, ఊదరి రామరాజు, కడారి శివ,ఉడుతల భరత్ రామగోని భాను, హేమంత్ కందాడి శ్రీధర్, ఉప్పు అనిల్ , సాయి గణేశ్ పాల్గొన్నారు.