
వెలుగు, నెట్ వర్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజీ విగ్రహానికి ఆరె మరాఠా సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి, బీజేపీ ఆధ్వర్యంలో జయంతి వేర్వేరుగా జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శివాజీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మందమర్రి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ధర్మ పరిరక్షణ కోసం యువత నడుం బిగించాలని, చత్రపతి శివాజీ పోర ట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం స్థానిక శివాజీ చౌక్ వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. లక్షెట్టిపేట పట్టణంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు.