ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ .. 1500 మంది బలగాలు..48 గంటల ఆపరేషన్..36 మంది హతం

ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ .. 1500 మంది బలగాలు..48 గంటల ఆపరేషన్..36 మంది హతం

ఛత్తీస్‌గఢ్ లో అక్టోబర్ 4న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 36 మంది మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్.పి తెలిపారు. మృతుల్లో ఐదుగురు మావోయిస్టు సీనియర్ కమాండర్లు ఉన్నట్లుగా గుర్తించామన్నారు.  దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు కమలేష్, నీతి, సురేశ్, సలాం ఉన్నట్లు పేర్కొన్నారు. మిగతా మృ తుల వివరాలను గుర్తించే పనిలో ఉన్న ట్లు తెలిపారు. మృతదేహాలను తరలించేందుకు అధికారులు ట్రాక్టర్లను తెప్పించారు. 28 మృతదేహాలను దంతె వాడకు, 3 మృతదేహాలు నారాయణ పూర్ కు  తరలించారు.

అయితే ఈ భారీ ఎన్ కౌంటర్ లో    సీఆర్పీఎఫ్,  బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన మొత్తం 1500 మంది జవాన్లు 48 గంటల పాటు  ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.. ఈ ఆపరేషన్ ఛత్తీస్ గఢ్ లో ఇదే అతిపెద్ద ఎన్ కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 

Also Read :-  సెట్లో ఏనుగుల కొట్లాట.. గాయాలతో తప్పి పోయిన ఏనుగు!

ఈ ఏడాది ఇప్పటి వరకు 164 మంది నక్సల్స్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో నక్సలైట్ శిబిరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. అక్టోబర్ 1న ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు మట్టి ట్రాక్ కింద అమర్చిన మూడు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్ (IED)లను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు.

మరో వైపు  ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని ఏపీ పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అలాగే మృతుల ఫొటోలు, వివరాలు పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్రనేతలు ఉన్నందువల్లే మృతుల వివరాలు వెల్లడించడం లేదా? అని ప్రశ్నించారు.