ఆ 8 మందిని అప్పగించండి.. టేకామేటా, ముస్పర్సీ  గ్రామస్తుల వేడుకోలు

ఆ 8 మందిని అప్పగించండి.. టేకామేటా, ముస్పర్సీ  గ్రామస్తుల వేడుకోలు

భద్రాచలం,వెలుగు: చత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలోని టేకామేటా, ముస్పర్సీ గ్రామాలకు చెందిన 8 మంది ఆదివాసీలను శనివారం భద్రతాబలగాలు తమ వెంట తీసుకెళ్లాయని, వెంటనే తమకు అప్పగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. టేకామేటాకు చెందిన గూడ్సు కోర్సా, దినేశ్​కోర్సా, సుకు మడవి, సోమా కోర్సా, సామా కోర్సా, రామ్సూ కోర్సా, ముస్పర్సి గ్రామానికి చెందిన హేమూ కోర్సా, లులా వాడేలను భద్రతాబలగాలు పట్టుకెళ్లినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రెండు రోజులుగా వీరు అడవుల్లో తమ వారికి కోసం వెతుకుతున్నారు. శనివారం ఆయా గ్రామాల అడవుల్లోనే భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు చనిపోగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అబూజ్​మాఢ్ అడవుల్లో 32 గంటలుగా ఎన్​కౌంటర్​జరుగుతోంది.