భద్రాచలం,వెలుగు : ఆదివాసీ లోకం ప్రధాని మోదీకి అండగా నిలబడాలని చత్తీస్గఢ్సీఎం విష్ణుదేవ్‌సాయి పిలుపునిచ్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. ఆదివాసీలకు పెద్ద పీఠ వేసింది బీజేపీనే అని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలన్నారు. చత్తీస్‌గఢ్‌కు, తెలంగాణకు దగ్గరి సంబంధాలున్నాయని, దక్షిణ అయోధ్య భద్రాచలంలో రాముడు వెలిస్తే, ఆయనకు జన్మనిచ్చిన తల్లి కౌసల్యది చత్తీస్‌గఢ్ అని అన్నారు.
కాకతీయ క్లస్టర్‌లోని ఖమ్మం, మహబూబాబాద్,వరంగల్పార్లమెంట్స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు. కాకతీయుల సామ్రాజ్య వారసులు బస్తర్రాజు కమల్‌చంద్ బంజ్‌దేవ్,గుజ్జుల ప్రేమ్‌చంద్రారెడ్డి, ధర్మారావు, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రంగా కిరణ్, కామారెడ్డి ఎమ్మెల్యే టి. వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. తర్వాత చత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి రాములవారిని దర్శించుకున్నారు. ఈవో రమాదేవి నేతృత్వంలో అర్చక బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. తర్వాత ఈవో సచిత్ర రామాయణ పుస్తకాన్ని బహుకరించారు.