చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌కోర్టు సంచలన తీర్పు..బాలికపై అత్యాచారం,హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌కోర్టు సంచలన తీర్పు..బాలికపై అత్యాచారం,హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
  • చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌కోర్టు సంచలన తీర్పు

కోబ్రా(చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌): ఒకేసారి ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరొకరికి జీవిత ఖైదు విధించింది. బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు, బాలిక తండ్రిని, నాలుగేండ్ల చిన్నారిని కూడా చంపిన కేసులో దోషులకు ఈ శిక్ష విధించింది.

ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న కోర్బా జిల్లా కోర్టు తీర్పు వెలువరించగా, ఆలస్యంగా ఉత్తర్వులు బయటకు వచ్చాయి. కోర్బా జిల్లాలోని గధుప్రోడా గ్రామానికి చెందిన బాలిక (16)ను సంత్రం మజ్వార్‌(49) అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు ఆ బాలిక, ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. 

దీంతో కోపం పెంచుకున్న మజ్వార్ అడవిలో పశువులను మేపడానికి వెళ్లిన బాలికపై తన అనుచరులు నలుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై అంతా కలిసి బాలికను రాళ్లతో కొట్టి చంపారు. బాలిక తండ్రి (60)ని, అతని నాలుగేండ్ల మనుమరాలిని కూడా హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు..తాజాగా తీర్పు వెలువరించింది.