ఛత్తీస్‌గడ్ లో డీఆర్జీ సైనికులు సంబరాలు చేసుకున్నారు. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో పది మంది మావోయిస్టులను హతమార్చినందుకుగాను ఆడిపాడి సంబరాలు చేసుకున్నారు జవాన్లు. వందల సంఖ్యలో డీఆర్జీ సైనికులు, సీఆర్పీఎఫ్ బృందాలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నాయి. మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గడిచిన 11 నెలల్లో 207 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లుగా బస్తర్ ఐజి సుందర్‌రాజ్ తెలిపారు.
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా కుంట బ్లాక్ బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 22న భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు.