పునరావాసం కోసం నకిలీ మావోయిస్టుల అవతారం

పునరావాసం కోసం నకిలీ మావోయిస్టుల అవతారం
  • బయటపడడంతో ముగ్గురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించే స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టడంతో ముగ్గురు వ్యక్తులు మావోయిస్టుల అవతారం ఎత్తారు. చివరకు అసలు నిజం బయటపడడంతో ముగ్గురినీ కటకటాల వెనక్కు నెట్టారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని బాలోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శుక్రవారం ముగ్గురు యువకులు వచ్చారు. తాము బాలోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మోహ్లా మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియా కమిటీలోని మావోయిస్టులమని, లొంగి పోయేందుకు వచ్చామని ఎస్పీకి చెప్పారు. 

అయితే బాలోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అసలు మావోయిస్టుల కదలికలే లేకపోవడంతో ముగ్గురిపై అనుమానం వచ్చిన పోలీసులు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేశారు. దీంతో వారు అసలు మావోయిస్టులే కాదని తేలింది. బీజాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన మధు మోడియా, మన్కు భోగాం, ఓం ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతాం అనే ముగ్గురు పునరావాస స్కీం కోసమే మావోయిస్టులుగా నాటకం ఆడినట్లు బయటపడింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు..