ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా జేగురుగొండ పోలీసు స్టేషన్ పరిధిలోని మావో అగ్రనేత హిద్మా స్వగ్రామం పువ్వర్తిలో నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ జెండా ఎగురవేశారు పోలీసులు. పోలీస్ శిబిరం ఏర్పాటు చేశారు. పువ్వర్తిలో పోలీసు క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులకు గట్టి పట్టున్న గ్రామాలు కొరగట్ట,మీనగట్టు,జబ్బగట్ట, కంచాల,గుండ్రాయ్ గ్రామాలు పోలీసుల ఆధీనంలో కి వచ్చినట్టు తెలుస్తోంది.శిబిరం ఏర్పాటు చేసిన 48 గంటల్లో 7 సార్లు క్యాంపుపై కాల్పులు జరిపి మందుపాతరలు పేల్చారు మావోయిస్టులు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడివి హిద్మా లక్ష్యంగా 1000 మందికి పైగా భద్రతాదళాలు దండకారణ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత హిద్మా సుమారు 35 పైగా దాడులలో కీలక పాత్ర పోషించారు. హిద్మా నేతృత్వంలో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది జవాన్లు, బుర్కా పాల్ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. హిద్మాపై ఇప్పటికే రూ.25 లక్షల రికార్డు ఉంది. పోలీసు ఉన్నతాధికారులు హిడ్మా గ్రామంలో అతని తల్లిని కలిసి పరామర్శించారు.