ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేఫథ్యంలో ప్రతిపక్ష బీజేపీ మోదీకి గ్యారెంటీ 2023 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. రాయ్‌పూర్‌లోని పార్టీ ఆఫీసులో కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రాబోయే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా హామీ ఇచ్చారు.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు
- ఎకరాకు 21 క్వింటాళ్ల వరిధాన్యాన్ని కొనుగోలు
- రెండేళ్లలో లక్ష ఖాళీ పోస్టులను భర్తీ
- భూమిలేని రైతులకు ఏటా రూ.10 వేల అర్ధిక సహాయం
- రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు
- క్వింటాల్‌కు రూ.3100 చొప్పున వరి కొనుగోలు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు
- భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి సంవత్సరం 10000 రూపాయలు
- ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షల వరకు చికిత్స
- యువతకు ఉద్యమం క్రాంతి యోజన కింద 50 శాతం సబ్సిడీపై వడ్డీ లేకుండా రుణం
- గ్యాస్ సిలిండర్ రూ.500
- కళాశాల విద్యార్థులకు నెలవారీ ప్రయాణ భత్యం
- ఐఐటీ తరహాలో ప్రతి జిల్లాలో సీఐటీని ప్రారంభం
- పంచాయతీ స్థాయిలో 1.5 లక్షల మంది యువకుల నియామకం
ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. గత ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 68 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 15 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
- ALSO READ | సర్కార్ వారి అమ్మకం: ఉల్లి కిలో 25 రూపాయలే