
ఢిల్లీలో లిక్కర్ స్కాం కథ ముగిసిన వెంటనే ఈడీ ఫోకస్ ఛత్తీస్ గఢ్ పై పడింది. ఛత్తీస్ గఢ్ లో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే విచారణ మొదలు పెట్టిన ఈడీ.. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేంద్ర భగేల్ ఇంటి తలుపు తట్టింది. లిక్కర్ స్కాం లో ఆయన కుమారుడి పాత్రపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణకు రంగం సిద్ధం చేశారు.
మాజీ సీఎం కుమారుడు చైతన్య లిక్కర్ స్కాంకు పాల్పడ్డాడని, దాదాపు రూ.2161 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మొత్తం 4 వేల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు ఈడీ విచారణకు బయలుదేరారు. అందులో భాగంగా సోమవారం (మార్చి 10) దుర్గ్ జిల్లాలోని 14 స్థలలలో సోదాలకు దిగారు అధికారులు. మాజీ సీఎం భూపేష్ భగేల్, ఆయన కుమారుడు చైతన్యతో పాటు కీలక నేతల, అనుమానితుల ఇళ్లపై సోదాలకు దిగారు ఈడీ అధికారులు.
ఈడీ అధికారుల సోదాలపై మాజీ సీఎం కార్యాలయం ఎక్స్ లో ప్రకటన చేసింది. గత ఏడేండ్లుగా తప్పుడు కేసులు పెట్టాలని చేసిన ప్రయత్నాలు కోర్టులో నిలవలేదు. తాజాగా మాజీ సీఎం, ఇతర నాయకుల ఇళ్లపై సోదాలు దిగారని.. తప్పుడు కేసులతో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తే అది ఎప్పటికీ జరగదని ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : చర్చ జరగాల్సిందే.. ఓటింగ్ అక్రమాలపై రాహుల్ పట్టు
ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసి లక్మా అరెస్టుకు నెల రోజుల తర్వాత మాజీ సీఎం కుటుంబంపై ఈడీ రైడ్స్ కు దిగడం చర్చనీయంగా మారింది. లక్మాను జనవరిలో అరెస్టు చేశారు. భగేల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులపై రైడ్స్ నిర్వహిస్తున్నామని, లిక్కర్ స్కాం జరిగినట్లు ఆధారాలు ఉన్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రంలో లిక్కర్ పాలసీ, సేకరణ విధానం సక్రమంగా లేదని, రెండు కంపెనీలు 2018లో హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీంతో 2023లో ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ వవ్యహారంలో 3 డిస్టిల్లరీ కంపెనీలు, ముగ్గురు డిస్టిబ్యూటర్లు, కొంతమంది ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ఒప్పందంతో సుమారు రూ.3,800 కోట్లు ప్రభుత్వానికి కష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. అయితే ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర భగేల్ తనయుడు చైతన్య పాత్ర కీలకంగా ఉందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మాజీ సీఎం ఇళ్లు, సన్నిహితుల ఇళ్లలో సోదాలకు దిగారు.