నెత్తి మీద జుత్తు లేకపోతే సినిమా ఆఫర్లు రావడం కష్టమేనంటున్న ఛావా సినిమా నటుడు..

నెత్తి మీద జుత్తు లేకపోతే సినిమా ఆఫర్లు రావడం కష్టమేనంటున్న ఛావా సినిమా నటుడు..

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా ఇటీవలే హిందీలో రిలీజ్ అయిన ఛావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా ఓ ఇంటర్వూ లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడంటే రూపం, రంగు, బాడీ స్ట్రక్ట్చర్ వంటివాటితో అవసరం లేకుండా సినిమా ఆఫర్లు ఇస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం తల మీద వెంట్రుకలు లేకపోతే కనీసం ఆడిషన్స్ కి కూడా రానిచ్చేవారు కాదని అన్నాడు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోయే సమస్యతో బాగా ఇబ్బంది పడ్డానని అంతేకాకుండా కొన్ని సినిమాల్లో నటించే ఆఫర్లు కూడా మిస్ చేసుకున్నానని వాపోయాడు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విగ్గులు, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటివి అందుబాటులో ఉండటంతో ఈ అంశాలు జుట్టు రాలె సమస్యలు ఉన్నవారికి బాగా కలసి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జుట్టు విషయంలో అక్షయ్ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ విషయం ఇలా ఉండగా అక్షయ్ ఖన్నాహీరో అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చాడు. కానీ అవుట్ లుక్ పర్సనాలిటీ చూసి అవకాశాలు ఇవ్వలేదు. అయినప్పటికీ పటు విడవకుండా ప్రయత్నించి బాగానే సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం విలన్, గెస్ట్, సపోర్టింగ్ రోల్స్ వంటివి చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.