
బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ చోరీ 2 (Chhorii 2). ఇది 2021లో వచ్చిన చోరీ మూవీకి సీక్వెల్. 2018లో వచ్చిన మరాఠీ మూవీ లపాచపీ ఆధారంగా ఈ చోరీ మూవీని తెరకెక్కించారు.
విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించిన చోరీ 2 ఏప్రిల్ 11 నుంచి నేరుగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్ మరియు హార్దికా శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ప్రస్తుతం చోరీ 2 మూవీ ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ మూవీ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమ్ అవుతుంది. అయినప్పటికీ ఈ స్థాయిలో ట్రెండ్ అవ్వడం విశేషం.
ఈ వారంలో చోరీ 2 మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హార్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? సీక్వెల్కి మించిన భయాలు, ట్విస్టులు ఇందులో ఉన్నాయా? లేదా అనేది చూద్దాం.
కథేంటంటే:
ఈ కథ చోరీ మూవీ కంప్లీట్ అయిన చోటు నుంచే మొదలవుతుంది. సాక్షి (నుష్రత్ భరుచ్చ) తన కుమార్తె ఇషానీ (హార్దిక శర్మ) వీరిద్దరూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. సాక్షి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఇషాని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. అయితే, ఓ రోజు రాత్రి 7 ఏళ్ళ కుమార్తె ఇషానీని ఒక మర్మమైన శక్తి అపహరిస్తుంది. సాక్షి తన కుమార్తెను వెతుక్కుంటూ వెళుతోంది. అలా సాక్షి ఒక భయంకరమైన దయ్యాల గ్రామానికి వెళుతోంది.
అయితే, ఆ గ్రామంలో ఒక దుష్ట శక్తికి ఓ రాక్షస ఆచారం ఉంటూ వస్తోంది. అక్కడున్నా ఆ దయ్యలా గ్రామం ఆచారం ఏంది? ఆ రాజ్యంలో నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు సాక్షి ఎలాంటి ప్రయత్నం చేసింది? సాక్షి స్నేహితురాలు, పోలీసు అధికారి సమర్ (గష్మీర్ మహాజని) ఎటువంటి సాయం చేసింది? ఆ గ్రామంలోని ప్రధాన పూజారి దాసి (సోహా అలీ ఖాన్) అసలు రూపం ఏంటీ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
హారర్‌తో పాటు బాలికలపై జరుగుతున్న సామాజిక దురాచారాల గురించి మెసేజ్ ఇచ్చారు. బాల్య వివాహాల అంశాన్ని చూపించారు. ఈ క్రమంలో తన బిడ్డను రక్షించుకోవడానికి, అతీంద్రియ శక్తులతో ఓ తల్లి ఎలాంటి యుద్ధం చేసిందనేది కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ తెరకెక్కించారు.
ఫస్టాఫ్ లో కొన్నిచోట్ల భయపెట్టే సీన్స్, ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటోంది. సెకండాఫ్లో క్లైమాక్స్ వైపు వెళ్ళే కొద్దీ, కథ మరింత వేగం పుంజుకుంటుంది. “ఆదిమ పురుషుడు”గురించి చర్చించిన పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. దానికి తోడు క్లైమాక్స్‌లో బాల్య వివాహం గురించి ఇచ్చే సందేశం ఆలోచనాత్మకను కలిగిస్తోంది.
రచయిత-దర్శకుడు విశాల్ ఫురియా మరియు సహ రచయిత అజిత్ జగ్తాప్ తీసుకున్న బాల్య వివాహాల పాయింట్కు, హార్రర్ నేపథ్యాన్ని లింక్ చేసి సక్సెస్ అయ్యారు. ఇందులో నటించిన నటి నటులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్లలో నుష్రత్ బరూచా అద్భుతమైన నటనను కనబరిచింది. బాలనటి హార్దికా శర్మ కూడా బాగానే నటించింది.
హారర్ ఎలిమెంట్లే కాకుండా సైకలాజికల్ అంశాలుతో సాగిన చోరీ 2 ఆకట్టుకుంటోంది. సీక్వెల్కి మించిన భయాలు, ట్విస్టులతో సాగే థ్రిల్లర్ ఇది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ స్త్రీ 2 తర్వాత, ఆ రేంజ్ హర్రర్ ఎలిమెంట్స్ చోరీ 2లో పుష్కలంగా ఉన్నాయి.
Get ready to meet #Chhorii2OnPrime,
— prime video IN (@PrimeVideoIN) April 10, 2025
Watch Now 👀 https://t.co/b88g2LSYID@Nushrratt @sakpataudi @FuriaVishal @TSeries @Abundantia_Ent #TamariskLane @PsychScares #BhushanKumar #KrishanKumar @vikramix @NotJackDavis @saurabhgoyall pic.twitter.com/DhLgK8ScmN