కృష్ణా ..రామా అనుకోవాల్సిన వయసులో ఓ బామ్మ స్టంట్స్ తో ఇరగదీసింది. 60 దాటితే పైకి లేవడానికి కూడా ఇబ్బంది పడే ఈ రోజుల్లో..ఓ బామ్మ 104 ఏళ్ల వయసులో స్కై డైవ్ చేసింది. స్కై డైవ్ అంటే..ఏ 10 అడుగులో..20 అడుగులో అనుకునేరు. 13,500 అడుగుల ఎత్తులో నుంచి 104 ఏళ్ల ఈ బామ్మ..స్కైడైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికా చికాగోకు చెందిన 104 ఏళ్ల ఓ బామ్మ పేరు డోరతీ హాఫ్నర్. అక్టోబర్ 1 ఆదివారం రోజు చికాగోకు నైరుతి దిశలో 140 కిలో మీటర్ల దూరంలో ఒట్టావాలోని ఎయిర్ పోర్టులో స్కై డైవ్ చేసింది. ఏకంగా 13,500 అడుగుల ఎత్తులో ఆమె స్కై డైవ్ చేసి వావ్ అనిపించింది. అత్యంత ఎక్కువ వయసులో స్కై డైవ్ చేసిన మహిళగా డోరతీ రికార్డు సృష్టించింది.
చిన్న హెలీకాప్టర్ లోపలి నుంచి తన ఇన్ స్ట్రక్టర్ తో డోరతీ హాఫ్నర్ డైవ్ చేసింది. పారాచూట్ సహాయంతో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. మేఘాల మధ్య తేలియాడింది. ఓ వైపు బలమైన గాలులు వీస్తున్నా..ఎలాంటి భయం లేకుండా గాల్లో ఎంజాయ్ చేసింది. కొద్ది సేపటి తర్వాత కిందకు దిగింది. దీంతో బామ్మ డోరతీ హాఫ్నర్ ధైర్యాన్ని అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. ఆమె కిందకు దిగగానే చప్పట్లతో ప్రశంసించారు.
??WORLD RECORD?? — Dorothy Hoffner became the oldest skydiver ever today.
— Jake Sheridan (@JakeSheridan_) October 1, 2023
"Age is just a number," the 104-year-old said after she jumped at Skydive Chicago Airport. Here’s her epic jump and free fall in slow-mo: pic.twitter.com/194NdxGzSU
104 ఏళ్ బామ్మ డోరతీ హాఫ్నర్ స్కైడైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 104 ఏళ్ల వయసులో బామ్బ స్కై డైవ్ చేయడం మామూలు విషయం కాదు.. బామ్మ నీకు సెల్యూట్ అని మెచ్చుకుంటున్నారు. బామ్మ అద్భుతమైన మహిళ..ఆమెకు చాలా ధైర్యం ఉందని కొనిడాయారు.
డోరతీ 100 ఏళ్ల వయసులో తొలిసారిగా స్కైడైవింగ్‌కు ప్రయత్నించారు. అప్పట్లో విమానం నుంచి కిందకు దూకేందుకు ఆమె సంకోచించడంతో వెనకున్న ఇన్‌స్ట్రక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి ముందుకు తోశారు. 2022 మేలో ఆమె 103 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత ఈ రికార్డును స్వీడెన్‌కు చెందిన లినేయా లార్సన్ ను బద్దలు కొట్టాడు. తాజాగా 104 ఏండ్ల వయసులో మరోసారి డోరతీ స్కైడైవింగ్ చేసి ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.