Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం

Health Tips: చికెన్, మటన్ లివర్లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం

నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ అనే మాట వినపడగానే నోరూరి పోతుంది కదా..రకరకాలు వండటం ద్వారా మటన్, చికెన్ ను బాగా తినడానికి ఇష్టపడు తుం టారు. చాలామంది నాన్ వెజిటేరియన్స్ చికెన్ లివర్స్, మటన్ లివర్స్ తినేందుకు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే చికెన్ లివర్, మటన్ లివర్ రెసిపీస్ తిన నికి చా లా రుచిగా ఉంటాయి. లివర్ ఫ్రై, లివర్ కర్రీ, లివర్ గ్రేవీ ఇలా రకరకాలుగా వండిన డిషెస్ చాలా ఫేమస్.. ఒక్క రుచిమాత్రమే కాదు..ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. చికెన్ లివర్, మటన్ లివర్ వంటకాలతో లాభాలు, నష్టాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

చికెన్ లివర్ తింటే ఆరోగ్యకరమైన లాభాలు.. 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. చికెన్ లివర్ (కాలేయం) పోషకాలకు అతిపెద్ద సోర్స్.ఇందులో ప్రోటీన్లు, ఐరన్, సెలినియం, విటమిన్ బి 12, ఫొలేట్, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉన్నాయి. బి12 విటమిన్ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. సెలినియం  క్యాన్సర్ బారిన పడే ప్రమదాన్ని నివారిస్తుంది. చికెన్ లివర్స్ తింటే రక్తంలో షుగర్ కంట్రోల్ చేస్తుంది.. ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఫొలేట్ అనేది సెక్సువల్ హెల్త్ ను మెరుగు పరుస్తుంది. ఉడకబెట్టిన బాయిల్డ్ చికెన్ లివర్ తినడం వల్ల బరువును కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. 

Also Read : బ్లో డ్రయ్యర్ ఎక్కువగా వాడుతున్నారా 

మటన్ లివర్ (కాలేయం ) తింటే లాభాలు.. 

చాలామంది మటన్ లివర్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో విటమిన్లు ఎ, డి, బి12, జింక్, ఐరన్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని  పెంచుతుంది. మటన్ లివర్ లో ఉండే ఖనిజాలు.. శరీరంలోని ఎంజైమ్ ల పనితీరును మెరుగుపర్చే శక్తిని కలిగి ఉంటాయి. 

చికెన్, మటన్ లివర్ ఇలా తింటే లాభాలు..

లివర్ ను ఎక్కువగా వేయించే బదులు, కూరగాయలతో ఉడికించి , సపరేట్ గా ఉడికించి తినడం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినడం మంచిది. చికెన్ కాలేయం కంటే మటన్ కాలేయం ఎక్కువ పోషకాలుంటాయి. అయితే లిమిట్ గా దీనిని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

చికెన్, మటన్ లివర్ ముఖ్యమైన సూచనలు 

  • చికెన్ లివర్, మటన్ లివర్లను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రరాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది..కాబట్టి వీటి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. 
  • గుండె, కిడ్నీ జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు లివర్ వంటకాలను ఎక్కువగా తినకూడదు.
  • గర్భిణీ స్త్రీలు చికెన్ లివర్ తినకుండా ఉంటే మంచింది. ఎందుకంటే చికెన్ లివర్ లో అధిక మొత్తంలో ఉండే విటమిన్ ఎ శిశువుకు హాని కలిగించే ప్రమాదం ఉంది. 
  • చికెన్ లివర్లలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కాబట్టి వాటిని వెన్నలోగానీ, ఇతర రకాల కొవ్వులోగానీ, నూనెలో గాని  వేయించి తినడం మంచిది కాదు. 
  • మీ చికెన్ లివర్లను వండడానికి ముందు వాటితో ఉండే కణజాలం లేదా కొవ్వును తొలగించాలి. ఎందుకంటే అవి మీరు తినే కొవ్వు పరిమాణాన్ని పెంచుతాయి.
  • చికెన్ లివర్లను కడగడం చాలా ముఖ్యం. వీటితో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. జాగ్రత్తగా శుభ్రం చేయడం, బాగా ఉడికించి తినడం తప్పనిసరి.