రోజుకో గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు అనే స్లోగన్ మనమందరం వినుంటాం.. దాన్ని చాలా మంది పాటిస్తారు కూడా.. ఈ క్రమంలోనే హెల్తీగా ఉండాలని మార్కెట్ కి వెళ్లి ట్రే గుడ్లు తెచ్చి రోజుకొకటి తినాలని ప్లాన్ చేస్తుంటారు. తెచ్చిన ట్రే గుడ్లలో ఎంచక్కా ఒకటి బాయిల్ చేసుకుని తిని మిగిల్నివి ఎక్కడ పెట్టాలా అని ఆలోచించి ఫ్రిజ్ డోర్ లోని ర్యాక్ ఉంది కదా అక్కడ పెడతాం.. అని అనుకుంటాం. ఇక్కడే అందరం ఓ పొరపాటు చేస్తున్నామట.. గుడ్లను ర్యాక్ లో పెట్టడం అస్సలు మంచిది కాదట. ఎందుకంటే..
ఇంట్లోని ఏ చిన్న తినే పదార్థమైన పాడవ్వకుండా ఉండాలంటే ఫ్రిజ్ లో పెడతాం.. ఈ క్రమంలోనే ఫ్రిజ్ డోర్ ను చాలా సార్లు ఓపెన్ చేసి అవరసమున్న వాటిని తీసుకుని క్లోజ్ చేస్తుంటాం. అలా ఓపెన్, క్లోజ్ చేసేటప్పుడు ఫ్రిజ్ లోని డోర్ లో ఉన్న గుడ్లు ఫ్రిజ్ టెంపరేచర్ నుంచి బయట ఉన్న టెంపరేచర్ లోకి వస్తాయి. ఇలా వెంటనే రావడం అస్సలు మంచిది కాదట. దీని వల్ల ఉష్ణోగ్రతలలో మార్పు వచ్చి గుడ్లు పాడయ్యేందుకు అవకాశం ఉంటుందట. కోడిగుడ్లు నిలవచేయడానికి ఉత్తమ మార్గం స్థిరమైన టెంపరేచర్ కలిగి ఉండటమే అని శాస్తవేత్తలు చెబుతున్నారు. ఫ్రిజ్ లోని లోపటి భాగమే ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు.