భలే చౌకబేరం : కిలో చికెన్ 150 రూపాయలు మాత్రమే

కార్తీక మాసం వచ్చేసింది.. ఇంట్లో పూజలు, వ్రతాలు ఉంటాయి.  దీంతో చాలామంది నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో కార్తీక మాసంలో  చికెన్ ధరలు పడిపోవడం సర్వసాధరణమే.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చికెన్ రేట్లు డౌన్ అయిపోయాయి.   కొన్ని రోజుల క్రితం చికెన్ కిలోకు రూ. 250 నుంచి రూ. 300 వరకు అమ్మారు. 

కానీ  ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ అయితే రూ. 150 , స్కిన్‌ లెస్‌ అయితే రూ. 170 గా ఉంది. . గడిచిన 4 నెలల కాలంలో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే  కావాడం విశేషం.  రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.  

ALSO READ : ప్రచారాలకు సంబంధించిన ప్రతి ఖర్చును లెక్కించాలి : అశోక్ కుమార్

కార్తీక మాసం కావడంతో అమ్మకాలు అంతగా లేవని వ్యాపారులు అంటున్నారు.  కానీ హైదరాబాద్ లో కోడిగుడ్ల రేట్లు మాత్రం యాథావిధంగా కొనసాగుతున్నాయి. ఒక్కటి ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు.