
తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్ ఫ్లూ భయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.బర్డ్ కేసుల గురించి వార్తలు రాగానే చికెన్ తినడం, కొనడం మానేశారు.కానీ.. బర్డ్ ఫ్లూ పట్ల అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఫ్రీ చికెన్ మేళాల్లో మాత్రం చికెన్ ఎగబడి తిన్నారు జనం. ఇప్పుడు పరిస్థితి మారింది.. కొన్ని వారాలుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో జనం మళ్ళీ చికెన్ షాపుల వైపు చూస్తున్నారు. దీంతో చికెన్ కు డిమాండ్ పెరుగుతోంది. చికెన్ ధరలు మళ్ళీ యధాస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.
బర్డ్ ఫ్లూ భయం లేకపోవడంతో పాటు.. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ కు డిమాండ్ మరింత పెరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణాలో చికెన్ ధరలు:
- హైదరాబాద్ లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 160 నుండి రూ. 180గా ఉంది.
- ఆదిలాబాద్ లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 160 నుండి రూ. 180గా ఉంది.
- ఖమ్మంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 150 నుండి 170గా ఉంది.
ఏపీలో చికెన్ ధరలు:
- విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 200గా ఉంది.
- కాకినాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 170 నుండి 190గా ఉంది.
- విశాఖపట్నంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 190గా ఉంది.
ఇవాళ చికెన్ రేట్లను బట్టి చుస్తే.. జనాల్లో బర్డ్ ఫ్లూ భయం పూర్తిగా తొలగిందనే అనిపిస్తోంది.. మరి, చికెన్ సేల్స్ మళ్ళీ మొదటికి వచ్చి చికెన్ షాపులు కస్టమర్లతో కలకలలాడతాయో లేదో చూడాలి.