బర్డ్ఫ్లూ ఎఫెక్ట్..చికెన్ షాపులు వెలవెల..మటన్ షాపులకు క్యూగట్టిన జనం

బర్డ్ఫ్లూ ఎఫెక్ట్..చికెన్ షాపులు వెలవెల..మటన్ షాపులకు క్యూగట్టిన జనం

బర్డ్ ఫ్లూఎఫెక్ట్..బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.సాధారణ రోజుల్లో నిత్య రద్దీగా ఉండే చికెన్ షాపులు..ఆదివారం(ఫిబ్రవరి 16) రోజు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో ఖాళీగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రా్ల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకితుందని కారణంలో చికెన్ తినేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.. దీంతో చికెన్ షాపులు గిరాకీ లేక వెలవెలపోతున్నాయి. మటన్, ఫిష్ షాపులకు గిరాకీ పెరిగింది. 

ఆదివారం (ఫిబ్రవరి 16)  హైదరాబాద్ లోని ఏ చికెన్ సెంటర్ చూసినా.. కస్టమర్లు లేక ఖాళీగా కనిపిస్తోంది.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లో ప్రజలు చికెన్ వైపు చూడటం లేదు.. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలు కొనుగోలు చేస్తున్నారు. 

హైదరాబాద్ నగర వ్యాప్తంగా మటన్ సెంటర్లు, చేపల మార్కెట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ తినాలంటే భయపడుతున్న జనాలు.. మటన్ షాపులకు క్యూగట్టారు. దీంతో మటన్ ధర అమాంతం పెరిగింది. 

సిటీలో సాధారణ రోజుల్లో కిలో మటన్ రూ.800లుగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు మటన్ వైపు మళ్లడంతో మాంసం అమ్మకందారులు క్యాష్ చేసుకుంటు న్నారు. కిలో మటన్ ధర రూ.1000లకుపైగా తీసుకుంటున్నారు.  

ఇక చికెన్ ధరలు తగ్గించినా కొనేవాళ్లు కరువయ్యారు. సాధారణ రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 240 నుంచి 280లకు ఉండేది. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ గిరాకీ తగ్గి చికెన్ షాపు ఓనర్లు ధరలు తగ్గించారు. 

ప్రస్తుతం కిలో చికెన్ ధర 170 రూపాయలనుంచి 220 వరకు అమ్ముతున్నారు. అయినా జనం చికెన్ కొనడానికి ఆసక్తి చూపడం లేదు.  చికెన్ అమ్మకాలు తగ్గిపోవ డంతో కనీసం మెయింటనెన్స్ లు కూడా కష్టమవుతుందంటున్న చికెన్ సెంటర్ల నిర్వాహకులు.