కోడి పొదగకుండానే గుడ్ల నుండి కడక్ నాథ్ పిల్లలు..అదేలా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అమ్మ నాన్న ఆశ్రమంలో ఓ వింత చోటుచేసుకుంది. కఢక్ నాధ్ కోళ్లు పొదగ కుండానే కోడి గుడ్ల నుండి పిల్లలు బయటికి వస్తున్నాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆశ్రమానికి తరలి వస్తున్నారు.. 

అమ్మానాన్న ఆశ్రమ నిర్వాహకులు కఢక్ నాథ్ కోళ్లను పెంచుతున్నారు. అయితే కోళ్లు ఆశ్రమ చుట్టుపక్కల పెట్టిన గుడ్లను ఒకచోట చేరుస్తున్నారు.  అయితే అవి కాస్తా పిల్లలుగా మారుతున్నాయి. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కోడి పొదగ కుండానే గుడ్లు నుంచి పిల్లలు బయటికి వస్తున్నాయని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. 

ఇవి కూడా చదవండి: వానాకాలం .. అల్లం వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..

మాములుగా అయితే కోడి గుడ్లు పెట్టిన తర్వాత సుమారు 20 రోజులు పొదిగిన తర్వాతనే పిల్లలు బయటికి వస్తాయి.  కానీ ఈ రకం కోళ్లలో  పొదగకుండానే గుడ్ల నుండి  పిల్లలు వస్తుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.