Health Alert: దోమలను లైట్ తీసుకోకండి.. తెలంగాణలో చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి.. 

Health Alert: దోమలను లైట్ తీసుకోకండి.. తెలంగాణలో చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి.. 

ఇండియాలో చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది.2018 నుండి 2024 మధ్య చికెన్ గున్యా కేసులు పెరిగాయని తెలిపింది.  తెలంగాణాలో చికెన్ గున్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ. అయితే.. తెలంగాణలో  గత మూడేళ్ళుగా కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా చికెన్ గున్యా కేసులు గానీయంగా పెరిగాయని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ.

తెలంగాణాలో గత ఏడాది కేవలం 10 కేసులే నమోదు కాగా.. ఈ ఏడాది 480 కేసులు నమోదైనట్లు తెలిపింది. 2020లో 20గా ఉన్న చికెన్ గున్యా కేసుల సంఖ్య 2024లో 480కి చేరింది. 2018లో తెలంగాణ వ్యాప్తంగా 500 చికెన్ గున్యా కేసులు నమోదు కాగా.. 2019లో 1000కి చేరింది. అయితే.. ఆ తర్వాతి మూడేళ్ళలో కేసుల సంఖ్య బాగా తగ్గినట్లు తెలుస్తోంది.

ALSO READ | గురునానక్ కాలేజీలో టెన్షన్ టెన్షన్.. వారం వ్యవధిలోనే ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్..

ఈ క్రమంలో చికెన్ గున్యా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. దోమలను నిర్లక్ష్యం చేయద్దని హెచ్చరిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. చికెన్ గున్యా సోకితే లక్షణాలు తీవ్రంగా ఉంటాయని.. ఒక్కోసారి నెలల తరబడి ఉండే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు.