హైదరాబాద్, వెలుగు: 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండేవారు.. ఇప్పటికే 18 ఏండ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2025 గత నెల 20 నుంచి ప్రారంభమైందని, రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్కే భవన్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
Voters.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ తోనూ ఓటు నమోదు చేసుకోవచ్చని సీఈఓ తెలిపారు. అక్టోబర్ 28 వరకు సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.