మునుగోడు బై పోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈఓ వికాజ్ రాజ్ తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ తో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పారు. నిన్న జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. నాన్ లోకల్ వాళ్లు ఇంకా మునుగోడులోనే ఉన్నారనే దానిపై కంప్లైంట్లు వచ్చాయన్నారు. 2 గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెచ్చిన డబ్బులు, ఇతర సామాగ్రిని ఎన్నికల అబ్జర్వర్లు పట్టుకున్నారని వికాజ్ రాజ్ చెప్పారు.
ఇక మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ను రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్ సీఈఓ సెంట్రల్ ఆఫీస్ లో సిబ్బంది అబ్జర్వ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే దగ్గర.. ఒక్కరి కంటే ఎక్కువగా ఉన్న సెంటర్లను గుర్తించి పోలింగ్ స్టేషన్ లో ఉన్న అధికారులకు సమాచారం ఇస్తున్నారు. మునుగోడు టౌన్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసే దగ్గర గుమి కూడడంతో.. పోలింగ్ స్టేషన్ అధికారులను అలెర్ట్ చేశారు. వెంటనే వారిని అక్కడ నుంచి పంపించాలని ఆదేశించారు.